. . . ఎంబిబిఎస్ సీట్ల పెంపుదల కోసం సౌకర్యాల పరిశీలన
. . . నలుగురు ప్రోపేసర్ బృందం చె ఆస్పత్రిలో కూడా వివరాలు సేకరణ
నిజామాబాద్, బతుకమ్మ:
ప్రభుత్వ వైద్య కళాశాల నిజామాబాద్ కు అదనంగా ఎంబిబిఎస్ సీట్ల పెంపుదల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ తనిఖీలు చెపట్టింది. బుధవారం ఉదయం నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో ఎన్ఎంసీ నియమించిన ప్రోఫేసర్లు డా. రేఖ వాద్వాని, డా. అమీత్ త్యాగీ, డా, గణేష్ సదాశివ్ చౌదరి, డా. షమీమ్ మోంగాలు తనిఖీలు చేశారు.ముందుకు మెడికల్ కాలేజ్ అనుబంధ జనరల్ ఆసుపత్రిలో సోదాలు చేశారు.

నిజామాబాద్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రస్తుతం 120 ఎంబిబిఎస్ సీట్లు ఉండగా అదనంగా 50 సీట్లు పెంచాలని వాటిని 2026-27 విద్యా సంవత్సరంలో అనుమతించాలని అధికారులు జాతీయ వైద్య మండలి దరఖాస్తు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎన్ఎంసీ టీం ఈ తనిఖీలు చేపట్టారు.ఎన్ఎంసీ టీంకు కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్. డా క్రిష్ణ మోహన్, జిజిహెచ్ ఇంచార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ రాములు స్వాగతం పలికారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఎలాంటి సేవలు అందిస్తున్నాయి అని పరిశీలించారు. అనంతరం కాలేజీలో తరగతి గదులు, ల్యాబ్ తో పాటు హాస్టల్ లను తనిఖీలు నిర్వహించారు.

