గోవిందరాజస్వామి ఆలయంలో నిజామాబాద్ వ్యక్తి హల్చల్

తిరుపతి, బతుకమ్మ : ఏపీలోని తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి  హల్చల్ చేశాడు. దీంతో ఆలయంలో మరోసారి భద్రతా వైఫల్యం బయట పడింది. స్వామివారి ఏకాంత సేవ ముగిశాక ఆలయంలోకి ఓ వ్యక్తి మద్యం మత్తులో ప్రవేశించి, సిబ్బంది గుర్తించేలోపే ఆలయ గోడ దూకి లోపలికి వచ్చాడు. మహాద్వారం లోపల ఉన్న ఆలయం గోపురం ఎక్కి కలశాలు లాగే యత్నం చేశాడు. నిందితుడిని నిజామాబాద్ జిల్లా కూర్మవాడ పెద్దమల్లారెడ్డి కాలనీకి చెందిన వ్యక్తి తిరుపతిగా గుర్తించారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది గోపురానికి నిచ్చెనలు వేసి మూడు గంటల పాటు శ్రమించి అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈఘటనపై విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Nizamabad man stirs in Govindarajaswamy temple
Comments (0)
Add Comment