. . . ప్రైవేట్ స్కూళ్లకు విద్యార్థులు రాలేదు
. . . సర్కారు స్కూళ్లలో అంతంత మాత్రమే స్టూడెంట్స్
. . . హాస్టళ్లకు రావడం ప్రారంభించిన విద్యార్థులు
నిజామాబాద్, బతుకమ్మ:
వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైన బడి గంటలకు విద్యార్థుల నుంచి స్పందన అంతంతమాత్రమే. 2026-27 విద్యా సంవత్సరం జూన్ 12 న ప్రారంభం కావాల్సి ఉండగా వరుస సెలవుల తర్వాత మూడు రోజుల ఆలస్యంగా సోమవారం ప్రారంభం కాగా దానికి అమావాస్య ప్రభావం పడింది. విద్యా సంవత్సరం తొలిరోజున స్కూళ్లకు విద్యార్థులు ఎగబడి వెళ్లేవారు. అ ఒక్క రోజులో ఉన్న ప్రాముఖ్యత ప్రభుత్వ, ప్రైవేటు బడులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సర్వంగా సుందరంగా ముస్తాబయ్యాయి. సోమవారం ఉదయం బండి గంటల సమయానికి మోగిన విద్యార్థులు మాత్రం బడి ముఖం చూడలేదు.

విద్యా సంవత్సరం ప్రారంభ తొలి రోజు అమావాస్య కావడంతో ఒక హిందూ మతానికి చెందిన పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు పంపుటకు ఇష్ట పడలేదు. ప్రైవేట్ స్కూళ్లలో ఇ పరిస్థితి దారుణంగా ఉంది. విధులలోకి ఆటోలు, వ్యాన్లు, బస్సులు వచ్చిన ఒకరిద్దరు మినహా మిగిలిన పిల్లలు అంతంత మాత్రంగానే హాజరు అయ్యారు. ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు తొలి రోజు సందడి కనిపించింది. విద్యాశాఖ టీచర్లు బడి బాట లక్ష్యాలను నిర్ధేశించడంతో సార్లు కొత్త విద్యార్థుల నమోదు, ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రారంభం ఏర్పాటు చేశారు. ఉర్దూ మీడియం పాఠశాల విద్యార్థులు చాలా హాజరయ్యారు. వేసవి సెలవుల తరువాత హాస్టళ్లకు, గురుకుల లకు విద్యార్ధుల రాక ప్రారంభమైంది. అధునిక టెక్నాలజీ పరంగా ప్రపంచం ఒక వైపు దూసుకు వేళుతుంటే అమావాస్య అని విద్యార్థులను స్కూళ్లకు పంపకపోవడపై ఒ వైపు విద్యా వేత్తలు, మెదావులు పెదవి విరుస్తున్నారు. విద్యార్ధుల తల్లిధండ్రులు మాత్రం సంప్రాదాయాలు, ఆచారాలకు విలువ ఇస్తాం కాబట్టి అమావాస్య రోజు తొోలిసారి ఎలా బడికి పంపాలంటున్నారు….

