తెలంగాణ యూనివర్సిటీలో జాతీయ సదస్సు

 

. . . ఐఎంసీ 2026 బ్రోచర్ ఆవిష్కరణ

 

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

 

తెలంగాణ యూనివర్సిటీ, నిజామాబాద్ లోని రసాయన శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఇన్నోవేషన్స్ ఇన్ మెడిసినల్ కెమిస్ట్రీ (ఐఎంసీ 2026)” అనే జాతీయ సదస్సు మార్చి 25–26 తేదీలలో నిర్వహించబడనుంది. దీనికి సంబంధించిన బ్రోచర్ ని యూనివర్సిటీ వైస్ ఛాన్స్ లర్ టి.యాదగిరిరావు, రిజిస్టార్ ఎం.యాదగిరి ఆవిష్కరించారు. విభాగాధిపతి డాక్టర్ కే.సాయిలు మాట్లాడుతూ ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న అధ్యాపకులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని మెడిసినల్ కెమిస్ట్రీ రంగంలో జరుగుతున్న తాజా పరిశోధనలు, ఆవిష్కరణలపై చర్చించనున్నారని తెలిపారు. పరిశోధకులు తమ అబ్ స్ట్రాక్ట్ లను మార్చి 15 లోపు సమర్పించవలసిందిగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమoలో డాక్టర్ ఎ.నాగరాజు, డాక్టర్ బాలకిషన్, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ నాగబాబు పాల్గొన్నారు.

 

National Conference at Telangana University
Comments (0)
Add Comment