. . . రెండు హోటళ్లకు జరిమాన విధింపు
బాన్సువాడ, బతుకమ్మ :
బాన్సువాడ పట్టణంలో పలు హోటళ్లు ,రెస్టారెంట్లు మంగళవారం బాన్సువాడ కమిషనర్ గోపు గంగాధర్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. రాబోవు వర్షాకాలన్ని దృష్టిలో పెట్టుకొని పట్టణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే దిశగా హోటళ్ళలో నిల్వ ఉన్నటువంటి సామాగ్రి ,వారు వాడే తినుబండారాలను తనిఖీ చేశారు. హోటళ్ళలో చాలా రోజుల నుండి నిల్వ ఉన్నటువంటి సామాగ్రిని వెంటనే తొలగించాలని హోటల్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. కొన్ని హోటళ్ళలో శుభ్రత లేని కారణంగా వెంటనే శుభ్రం చేయించుకోవాలని లేని యెడల జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. శుభ్రత ప్రమాణాలు పాటించని రెండు హోటళ్ళకు జరిమానాలు సైతం విధించడం జరుగుతుంది అన్నారు. రాబోవు వర్షాకాలం దృష్ట్యా హోటళ్ళలో శుభ్రత పాటించాలని ప్రతీ రోజు హోటళ్లను తనిఖీ చేయడం జరుగుతుందని శుభ్రత ప్రమాణాలు పాటించిన హోటళ్ళకు జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. హోటల్ యజమానులకు శుభ్రత ప్రమాణాలపై పలు సూచనలు జారీ చేయడం జరిగింది. జారీ చేసిన సూచనలు తప్పకుండా పాటించాలని ఆదేశించారు.