103 అమృత్ భారత్ స్టేషన్లను జాతికి అంకితమిచ్చిన మోదీ

వెబ్ న్యూస్, బతుకమ్మ : అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 18 రాష్ట్రాల్లో ఆధునికంగా తీర్చిదిద్దిన 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రధాని నరేంద్ర మోదీ రాజస్థాన్ నుంచి వర్చువల్ ప్రారంభించారు. వీటిని జాతికి అంకితమిచ్చారు. ఇందులో తెలంగాణలోని బేగంపేట, కరీంనగర్, వరంగల్ రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

బేగంపేట రైల్వేస్టేషన్ లో మహిళలే పని చేస్తారు : కిషన్ రెడ్డి

తెలంగాణలో రైల్వేల అభివృద్ధిని వేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.  బేగంపేట, కరీంనగర్, వరంగల్ అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. బేగంపేట రైల్వే స్టేషన్లో  మహిళలే పని చేయబోతున్నారని తెలిపారు.  దసరా రోజు కొముర వెళ్లి రైల్వేస్టేషన్ ను ప్రారంభిస్తాం. యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ పనులు ప్రారంభిస్తామన్నారు.

Modi dedicates 103 Amrit Bharat stations to the nation
Comments (0)
Add Comment