వెబ్ డెస్క్, బతుకమ్మ:
అమెరికన్ దర్యాప్తు సంస్థ ఎఫ్ బిఐ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ప్రకటించిన భారతీయుడు నితీష్ కౌశల్ ను అరెస్ట్ చేసింది. గత నెల 25న నితీష్ కౌషల్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని అమెరికన్ ఎఫ్ బిఐ ప్రకటించింది. అప్పటినుంచి అతడి కోసం అమెరికన్ పోలీస్ అతిపెద్ద మానవ వేట సాగించింది. నితీష్ కౌశల్ భారతీయుడు . పంజాబ్ రాష్ట్రానికి చెందినవాడు. జగ్గు భగవాన్ పురియా అనే అంతర్జాతీయ నేరగాళ్ల ముఠాలో ముఖ్యుడు. అమెరికాలోని వెరోన్ సరిహద్దులు సమీపంలో అతన్ని అరెస్ట్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో నేరాలు, మానవ అక్రమ రవాణా, మాదక ద్రవ్యాలు స్మగ్లింగ్, కిడ్నాప్, ఇలా అనే రకాల నేరారోపణలు నితీష్ కౌషల్ పై ఉన్నాయి..