మందకృష్ణ మాదిగను  కలిసిన ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం 

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ :   నిజామాబాద్ నగరంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ  మాదిగను ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యం బుదవారం కలిసింది. ఈ సందర్భంగా ఫీజు రియిబర్స్  మెంట్ కోరకు ప్రైవేటు విద్యాసంస్థలు చేస్తున్న ఉద్యమంలో వారి సహకారాన్ని అందించాలని కోరారు. మందకృష్ణ  మాదిగ సానుకూలంగా స్పందించి తమ పూర్తి మద్ధతు ఉంటుందని తెలిపారు.మూడు రోజులుగా ప్రైవేటు డిగ్రీ పీజీ కళాశాలలు బంద్ పాటిస్తున్నాయని తెలుసుకొని విచారం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యాసంస్థల సమన్వయకర్త నరాల సుధాకర్, సుజన్, బాలకృష్ణ, శ్రీనివాస్, దత్తు, సందేష్ తదితరులు పాల్గొన్నారు.

Mandakrishna Madiganu is the owner of private educational institutions
Comments (0)
Add Comment