28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

ఆటో చోరికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్

Must read

📰 Generate e-Paper Clip

 

. . . ఆటో స్వాధీనం

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :

 

మద్యానికి బానిసై దొంగతనాలు చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం ఈ నెల 13న జిన్నా నర్సింలు అనే వ్యక్తి తన ఆటో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని నగరంలోని 5వపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించారు. ఈ క్రమంలో షేక్ నయిమ్ అనే వ్యక్తి మద్యానికి అలవాటు పడి ఎటువంటి పని చేయకుండా చిల్లర దొంగతనాలకు అలవాటు పడి జీవితం కొనసాగిస్తూ ఉండేవాడని తెలిపారు. తాగడానికి డబ్బులు లేకపోవడంతో నిజామాబాద్ ఆర్.ఆర్ చౌరస్తా వద్ద గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసిన ఆటోని దొంగతనం చేసి నాందేడ్ లో విక్రయించడానికి వెళ్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు అర్సపల్లి బైపాస్ వద్ద నయిమ్ ని ఆటో తో సహా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. నేరం చేసిన నయిమ్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపించారు. కేసు చేదించిన ఎస్ ఐ శ్రీనివాస్, ఐడి పార్టీ సిబ్బంది, 5వ టౌన్ పోలీసు సిబ్బందిని సిఐ అభినందించారు.

More articles

Latest article