- వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్.టి.యాదగిరి రావు
నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో జులై 16న ప్రతిష్టాత్మకంగా జరిగే రెండవ స్నాకోత్సవాన్ని విజయవంతం చేయాలని వైస్ ఛాన్స్లర్ ఆచార్య టి.యాదగిరిరావు తెలిపారు. రెండవ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకొని విశ్వవిద్యాలయంలో కామర్స్ సెమినార్ హాల్లో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరి రావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ కే సంపత్ కుమార్ లతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ విలేకరుల సమావేశంలో వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ యాదగిరిరావు మాట్లాడుతూ 2006లో 6 విభాగాలతో ప్రారంభమైన తెలంగాణ విశ్వవిద్యాలయం నేడు 24 విభాగాలలో 31 కోర్సులకు విస్తరించిందన్నారు. నేడు తెలంగాణ విశ్వవిద్యాలయానికి బిక్నూరు పీజీ సెంటర్ , సారంగపూర్ లో ఎడ్యుకేషన్ కళాశాల తో పాటు జిల్లా వ్యాప్తంగా 109 అనుబంధ కళాశాలలు ఉన్నాయన్నారు. ఈ స్నాతకోత్సవంలో 2014 నుండి 2023 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో 15,557 మంది విద్యార్థులు లోగ్రాడ్యుయేషన్ లో 60,660 మంది విద్యార్థులు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 10,079 మంది విద్యార్థులు తమ డిగ్రీలు పూర్తి చేసినారన్నారు. ఈ స్నాతకోత్సవంలో 16 మంది దాతల సహకారంతో 16 విభాగాల నుండి మొదటి ర్యాంకు పొందిన 130 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ మరియు జూన్ 30, 2025 వరకు ఏడు విభాగాలలో పరిశోధనలు పూర్తి చేసుకున్న సుమారు 156 మంది పరిశోధకులకు పీహెచ్డీ పట్టాలు గవర్నర్ మాన్యశ్రీ జిష్ణుదేవ్ వర్మ గారి చేతుల మీది నుండి ఇవ్వనున్నారని వైస్ ఛాన్స్లర్ తెలిపారు.