11న మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఈనెల 11న నిర్వహించే మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ప్రతి ఒక్క బీసీ కుల బాంధవుడు పూలే జయంతి వేడుకల్లో  పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వినాయక్ నగర్ లోని హనుమాన్ జంక్షన్ వద్ద గలల పూలే విగ్రహం వద్ద వేడుకలు నిర్వహించి న్యూ అంబేద్కర్ భవన్లో గల ప్రభుత్వ అధికారిక సమావేశంలో పాల్గొని బీసీలు తమ బలాన్ని చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస్స ఆంజనేయులు, దర్శనం దేవేందర్, కరిపె రవీందర్, కొయ్యాడ శంకర్, చంద్రమోహన్, కోడూరు స్వామి, శ్రీలత, బగ్గలి అజయ్, విజయ్, మురళి, నరసయ్య, విష్ణు, బాలన్న, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

Mahatma Jyotibapule's birth anniversary celebrations on the 11th
Comments (0)
Add Comment