27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేద్దాం

Must read

📰 Generate e-Paper Clip

 

. . . మోరిల్ శ్రీనివాస్ రావు

 

బాన్సువాడ, బతుకమ్మ :

 

బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ నాతో పాటు పార్టీలో చేరిన ప్రతి బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక ధన్యవాదాలు అని మోరిల్ శ్రీనివాస్ రావు తెలిపారు. పట్టణంలోని తన నివాసంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ సిద్ధాంతాలు, ప్రజాసేవ లక్ష్యాలతో ముందుకు సాగుతూ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు అందరం సమిష్టిగా పనిచేద్దామని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో పార్టీ అభివృద్ధి కోసం గ్రామస్థాయి నుంచి మరింత బలంగా పనిచేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తూ, పార్టీ విజయానికి అందరి సహకారం అవసరమని మోరిల్ శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.ఈ సమావేశంలో మాజీ జడ్పిటిసి నార్ల రత్నకుమార్, జిల్లా మాజీ రైతు బందు అధ్యక్షులు దుద్దాల అంజిరెడ్డి, కౌన్సిలర్ మాక్బూల్ తదితరులు ఉన్నారు.

More articles

Latest article