విద్యార్థుల చదువు కోసం కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం..

 

కోటగిరి /రుద్రూర్, బతుకమ్మ:

కోనేరు శశాంక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్ధులకు ఉన్నత చదువులకు అర్థిక సహయం అందిచారు.  ఎంబిబిఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న కోటగిరి మండల కేంద్రానికి చెందిన కాంబ్లె నిఖితకు రూ.20 వేల రూపాయలు, పీజీ చదువుతున్న రాయకూర్ గ్రామానికి చెందిన బేగరి సాయి కుమార్ కు రూ.10  వేల రూపాయల చెక్కుల రూపంలో ట్రస్ట్ వ్యవస్థాపకుడు బీజేపీ నియోజకవర్గ నాయకుడు కోనేరు శశాంక్ ఆర్థిక సాయం అందించారు. అదివారం జరిగిన ఈ కార్యక్రమంలో  ట్రస్టీ కోనేరు శశాంక్ మాట్లాడుతూ…  మనిషి జీవితాన్ని ఒక్క చదువు మాత్రమే మార్చుతుందని చదువుకున్న వ్యక్తితో పాటు తమ కుటుంబాని సైతం సమాజంలో ఉన్నత స్థానంలో  నిలబెడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పుల్లల మోహన్ రావు,ఏముల నవీన్, హరి, విలాస్ రావు,సాయిలు, పాకాల సాయిలు, సాయి కుమార్, భూమయ్య, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Koneru Charitable Trust provides financial assistance for students' education.
Comments (0)
Add Comment