26.3 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ ఆత్మగౌరవ స్ఫూర్తి జయశంకర్ కు జర్నలిస్టుల నివాళి

Must read

📰 Generate e-Paper Clip

కంటేశ్వర్, బతుకమ్మ : నిజామాబాద్ కంటేశ్వర్‌లోని జయశంకర్ విగ్రహం వద్ద శనివారం మధ్యాహ్నం జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు ఆత్మీయంగా సమావేశమై ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సాక్షర దినపత్రిక జర్నలిస్ట్ ప్రకాష్, ప్రజా మీడియా సంపాదకులు డి.ఎల్.యన్ చారి, ప్రజా కలం జర్నలిస్ట్ అంగుళి మాలజీ, డాక్టర్ అంబేడ్కర్ యువజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సౌడ జయరాజ్, ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మూలనివాసి మాలజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జర్నలిస్టుల సమస్యలు, జయశంకర్ ఆశించిన అభివృద్ధి లక్ష్యాల దిశగా తెలంగాణ పురోగమించిందా అనే అంశాలపై చర్చ జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం ముగించుకుని అనంతరం జర్నలిస్టులతో కలయికలో పాల్గొన్నారు.

More articles

Latest article