- 12మందికి జైలు శిక్ష, 14మందికి జరిమాన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ డివిజన్ పరిధిలో అతిగా మద్యం సేవించి వాహనాలు నడిపిన 12మందికి జైలు శిక్ష, 14మందికి జరిమానా విధించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించినట్లు తెలిపారు. ఈ టెస్టుల్లో 26మంది పట్టుబడ్డట్లు పేర్కొన్నారు. వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ లలో మంగళవారం కౌన్సిలింగ్ నిర్వహించి స్పెషల్ జ్యూడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ ముందు హాజరుపరిచారు. వారిలో 12మందికి జైలు శిక్ష, 14మందికి జరిమానా విధించినట్లు తెలిపారు.