- 11మందికి జైలు శిక్ష, 6గురికి జరిమాన
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ డివిజన్ పరిధిలో అతిగా మద్య సేవించి వాహనాలు నడిపిన 11మందికి జైలు శిక్ష, 6గురికి జరిమాన విధించినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజావెంకట్ రెడ్డి తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో భాగంగా 17మంది పట్టుబడ్డారని తెలిపారు. వారికి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులు కౌన్సిలింగ్ నిర్వహించి మంగళవారం జిల్లా కోర్టులో హాజరు పరిచారని పేర్కొన్నారు. స్పెషల్ జుడిషియల్ 2వ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ 11మందికి జైలు శిక్ష, 6గురికి జరిమానా విధించినట్లు తెలిపారు.