24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మూసా కుటుంబ సభ్యులను పరామర్శించిన జాగృతి నాయకులు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నగరంలోని ధర్మపురి హిల్స్ కాలనీలో  విద్యార్థి షేక్ మూసా కుటుంబ సభ్యులను బుధవారం తెలంగాణ జాగృతి నిజామాబాద్ జిల్లా నాయకులు పరామర్శించారు. చందూరు మండలంలోని ఘన్ పూర్ గ్రామంలో ఉన్న తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో సోమవారం పదో తరగతి చదువుతున్న విద్యార్థి షేక్ మూసా వసతి గృహంలో మరణించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమంలో  తెలంగాణ జాగృతి నాయకులు అవంతి కుమార్, శేఖర్ రాజు , కరిపే రాజు, మీసాల శంకర్, యెండల ప్రసాద్ , సాయికృష్ణ , షాన్వాజ్ , ఆజామ్, గోపాల్ ,శివ మరియు మహిళా నాయకులు శోభా, రేఖ, సరిత తదితర నాయకులు పాల్గొన్నారు.

More articles

Latest article