. . . కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతల కిషన్
ఇందల్వాయి, బతుకమ్మ :
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఢిల్లీలో విద్యార్థులకు మద్దతుగా నిలిచినటువంటి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను అరెస్టు చేయడం సిగ్గుచేటు చేటని ఇందల్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తీర్మాన్ పల్లి సర్పంచ్ చింతల కిషన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మంగళవారం రాత్రి మాట్లాడారు. ఢిల్లీలో పేపర్ లీకేజ్ పై విద్యార్థులు శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేసి విచక్షణ రహితంగా దాడి చేయడంపై కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ తదితరులు మద్దతుగా నిలిస్తే వారిని అరెస్ట్ చేయడం బిజెపి పార్టీ చేస్తున్న అరాచకంగా నిలిచిందన్నారు. తక్షణమే అరెస్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేతలను బేషరతుగా విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లేని యెడల మండల జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళనలు చేయడం జరుగుతుందని హెచ్చరించారు.