…. పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏం. చెన్నయ్య
నిజామాబాద్, బతుకమ్మ:
హెల్త్ కార్డు విషయంలో ప్రభుత్వం ఆగమేఘాల మీద ఉద్యోగుల అభిప్రాయానికి విరుద్ధంగా ఏ ఒక్కరిని సంప్రదించకుండా జీతం మినహాయించడం సరికాదు అని పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఏం. చెన్నయ్య అన్నారు. ఆదివారం నిజామాబాద్ లో జరిగిన పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై చెన్నయ్య మాట్లాడుతూ… హెల్త్ కార్డు కొరకు ప్రభుత్వపరంగా ఎలాంటి జీవో రిలీజ్ చేయకుండా విధివిధానాలు నిర్ణయించకుండా , జూన్ నుంచి అమలుపరిచే విధానాలకు విరుద్ధంగా మే నెల జీతం లో ఎవరిని సంప్రదించకుండా మినహాయించడం పట్ల ఉపాధ్యాయులు చాలా ఆందోళనకు గురవుతున్నారు అన్నారు. ప్రభుత్వం పి ఆర్ సి మంచి ఫిట్మెంట్ తో వెంటనే ప్రకటించాలి అని డిమాండ్ చేశారు. పెండింగ్ డి ఎ లలో వెంటనే మూడు డీఏలు ప్రకటించాలి. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంఘాలకే కాకుండా ఇతర సంఘాల నాయకులను ట్రస్టులో సభ్యులుగా నియమించాలి అని కోరారు. మోడల్ స్కూల్, కేజీబీవీ, రెసిడెన్షియల్ ఉపాధ్యాయులకు కూడా హెల్త్ కార్డ్స్ వర్తింప చేసి, సిపిఎస్ విధానం రద్దు పరిచి ఓ పి ఎస్ అమలుపరచాలి అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. రత్నాకర్ రావు, నిజాంబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి బుచ్చన్న, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు, ప్రధాన కార్యదర్శి జనపాల లక్ష్మీరాజం, నాగేశ్వరావు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.