డాక్టరేట్ అందుకోవడం ఎంతో గర్వకారణం

బతుకమ్మ,మోర్తాడ్: చారిత్రాత్మక ఉన్నత ప్రమాణాలు గల ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి మోర్తాడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్, వైస్ ప్రిన్సిపల్ మర్రిపల్లి భూపతి డాక్టరేట్ పట్టా పొందడం ఎంతో గర్వకారణం అని మోర్తా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ పెద్దన్న అన్నారు. ఈ సందర్భంగా సోమవారం కళాశాలలో స్టాప్ అందరు మరిపల్లి భూపతిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ప్రొఫెసర్ రామకృష్ణ పర్యవేక్షణలో ఎలివేషన్ అండ్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇన్ తెలంగాణ 1956-2024 స్పెషల్ రిఫరెన్స్ నిజామాబాద్ డిస్టిక్ అనే అంశంపై పరిశోధనలు చేసి విద్యాభివృద్ధిని విశ్లేషించారని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా మర్రిపల్లి భూపతి మాట్లాడుతూ ప్రిన్సిపాల్ పెద్దన్న ప్రోత్సాహం, ఉపాధ్యాయ  బృందం ఉత్తేజాన్ని ఇచ్చిందన్నారు. అదేవిధంగా కళాశాల స్టాప్ మెంబర్స్, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో అకాడమీ కోఆర్డినేటర్ దశరథ్, సీనియర్ ఆధ్యాపకులు రాజయ్య, బాజన్న, సోనీ, రామమణి, నవీన్, జయ, గీత, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

It is a great honor to receive a doctorate.
Comments (0)
Add Comment