నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత

హైదరాబాద్, బతుకమ్మ :  హిందూ దేవుళ్లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ మహిళా మోర్చా, యువ మోర్చా కార్యకర్తలు హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయం వద్ద  బుధవారం ఆందోళన చేపట్టారు. ఈఆందోళనకు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీఎం దిష్టి బొమ్మను బీజేపీ శ్రేణులు దహనం చేశారు.  రేవంత్ రెడ్డి హిందూ దేవుళ్లపై  చేసిన వాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ నియోజకవర్గంలో రెండు చోట్ల భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం ఆదేశించింది.  ఈఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారు. 

 

 

 

Intense tension at Nampally BJP office
Comments (0)
Add Comment