వాహనాల తనిఖీ

ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండల కేంద్రంలో బుధవారం వాహనాల తనిఖీని ఎస్సై సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాహనదారుల ఆర్సీ, లైసెన్సులు తనిఖీ చేశారు. ఇంటిలో నుండి ద్విచక్ర వాహనదారులు బయలుదేరినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి ప్రయాణం చేయాలని ప్రయాణికులకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం పట్ల భారీ జరిమానాలతో పాటు, జైలు శిక్షలు పడుతున్నందున ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై జి సందీప్ కోరారు.

Inspection of vehicles
Comments (0)
Add Comment