27.3 C
Hyderabad
Friday, July 31, 2026

ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిల విడుదల  కాని పక్షంలో కాలేజీల నిరవధిక బంద్

Must read

📰 Generate e-Paper Clip

. . . వీసీ యాదగిరి రావు కు వినతి పత్రం ఇచ్చిన ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాలు

 డిచ్ పల్లి, బతుకమ్మ :

ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా బకాయి పడ్డ ఫీజు రీయెంబర్స్ మెంట్ డబ్బులను విడుదల చేయకపోతే కాలేజీల నిర్వహణ తమతో కావడం లేదని కళాశాలల యాజమాన్యాలు వైస్ ఛాన్సలర్ కు మొరపెట్టుకున్నాయి. ఫీజు రీయెంబర్స్ మెంట్ బకాయిలు విడుదల కాని పక్షంలో కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని బుదవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య యాదగిరి రావుకు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ ,పీజీ కళాశాలల యాజమాన్యాలు వినతి పత్రం అందజేశారు. వేల మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిన తమకు ఫీజు రీయెంబర్స్ మెంట్ విడుదల చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడం న్యాయం కాదని అన్నారు. గత సంవత్సర కాలం నుండి సిబ్బంది జీతభత్యాలు కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. భవనాల అద్దెలు కూడా చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకువెళ్లాలని వీసీ కి విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, మారయ్య గౌడ్, శంకర్, నరాల సుధాకర్, జైపాల్ రెడ్డి, బాలాజీ, గిరి, శ్రీనివాస్, సుజన్ రెడ్డిమలేహ, దుష్యంత్, రమణ, శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, నవీన్, హరికృష్ణ సాయిబాబ తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article