26.2 C
Hyderabad
Monday, August 3, 2026

ఏబీవీపీ మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ:  ఏబీవీపీ 43వ రాష్ర్ట  మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం అనే ఉద్ధేశంతో పనిచేస్తున్న విద్యార్థి సంఘమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్నో విద్యార్థి, సామాజిక ఉద్యమాలను నిర్మించి విజయ తీరాలకు చేర్చిందన్నారు. విద్యార్థులు ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు సిద్దిపేటలో నిర్వహించనున్న 43వ రాష్ట్ర మహాసభల్లో పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఇందూరు విభాగ్ సంఘటన మంత్రి రాజశేఖర్, జాతీయ కార్యవర్గ సభ్యుడు బి శివకుమార్ , ఇందూర్ విభాగ్ కన్వీనర్ శశి, నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్ మోహన్ గౌడ్, ఇందూర్ జిల్లా ప్రముఖ్ ఈశ్వర్, కామారెడ్డి జిల్లా ప్రముఖ్ గిరి, నగర అధ్యక్షుడు గొడుగు వెంకట కృష్ణ, ఏబీవీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article