ఏబీవీపీ మహాసభల పోస్టర్ల ఆవిష్కరణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: ఏబీవీపీ 43వ రాష్ర్ట మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఇందూర్ విభాగ్ ప్రముఖ్ రెంజర్ల నరేశ్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నారు. వ్యక్తి నిర్మాణం ద్వారానే జాతీయ పునర్నిర్మాణం సాధ్యం అనే ఉద్ధేశంతో పనిచేస్తున్న విద్యార్థి సంఘమని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎన్నో విద్యార్థి, సామాజిక ఉద్యమాలను నిర్మించి విజయ తీరాలకు చేర్చిందన్నారు. విద్యార్థులు ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు సిద్దిపేటలో నిర్వహించనున్న 43వ రాష్ట్ర మహాసభల్లో...