మోర్తాడ్ లో 120 కింటల్లా 50 కిలోల పిడిఎస్ బియ్యం పట్టివేత

బతుకమ్మ, మోర్తాడ్:
దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆకలిని తీర్చాలని లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రతినెల ఉచిత బియ్యం పంపిణీ చేస్తుంది. రోజు వారి కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాలతో పాటు కొన్ని మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే రేషన్ బియ్యాన్ని వండుకొని తింటున్నాయి. చాలా వరకు పక్కదారి పడుతున్నావని చెప్పడంలో సందేహం లేదు. మంగళవారం టాస్క్ పోర్ట్ సివిల్ సప్లై హైదరాబాద్ వో డీ ఏ ఎస్ ఓ శ్రీధర్ రెడ్డి టీం ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ సమీపంలో ఉన్న గోదాం లో బియ్యం నిల్వ ఉంచారన్న సమాచారంతో విషయం తెలుసుకొని నిల్వ ఉంచిన అక్రమ బియ్యం మీద దాడులు నిర్వహించి భారీ మొత్తంలో 120 క్వింటాళ్ల 50 కిలోల పిడి ఎస్ బియ్యం స్వాధీన పరుచుకున్నట్లు తెలిపారు. కోదాం సీజ్ చేసి బియ్యం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. టీంలో కే సుదర్శన్ రెడ్డి, జి లక్ష్మయ్య, శ్రీనివాసరావు, వారి వెంటఎన్ఫోర్స్మెంట్ డీటీ వినోద్ తదితరులున్నారు.

Comments (0)
Add Comment