ఇసుక అక్రమ రవాణా దారి మూసివేత

బతుకమ్మ, బాన్సువాడ :  బీర్కూర్ మంజీర బ్రిడ్జి కింద కొందరు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న దారిని శుక్రవారం సబ్ కలెక్టర్ కిరణ్మయి మూసి వేయించారు.గురువారం సాయంత్రం సబ్ కలెక్టర్ డోంగ్లీ నుంచి బీర్కూర్ వెళ్తుండగా కుర్ల శివారులో మంజీర వంతెన కింద కొందరు ఇసుక నింపే ప్రయత్నం చేస్తున్నట్లు గుర్తించారు. అధికారులను గమినించి అక్రమార్కులు అక్కడి నుంచి పారిపోయారు. దీంతో సబ్ కలెక్టర్  సమక్షంలో డోంగ్లీ, బీర్కూర్ మండలాల తహశీల్దార్లు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది శుక్రవారం జేసీబీ ద్వారా ఇసుక అక్రమ రవాణా చేసే దారిని తొలిగించారు. ఇక నుంచి ఎవరైనా ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని సబ్ కలెక్టర్ హెచ్చరించారు.

Illegal sand smuggling route closed
Comments (0)
Add Comment