కమ్మర్‌పల్లి జూనియర్ కాలేజీలో మౌలిక వసతుల కల్పన కోసం నా సహకారం అందిస్తా

 

. . . నాడు కేసీఆర్ ఆశీస్సులతో జూనియర్ కాలేజీ మంజూరు చేయించా

 

. . . మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

 

కమ్మర్ పల్లి, బతుకమ్మ :

 

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కమ్మర్‌పల్లి జూనియర్ కాలేజీ అభివృద్ధికి, మౌలిక వసతుల కల్పనకు తాను ఎల్లప్పుడూ ముందుండి తన వంతు సహకారం అందిస్తానని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల విజ్ఞప్తి మేరకు తన వియ్యంకుడు ఏనుగు దయానంద్ రెడ్డి సౌజన్యంతో కాలేజీకి సమకూర్చిన సుమారు రూ. 1.50 లక్షల విలువైన 40 డ్యూయల్ డెస్క్ (బల్లలు) లను ఆయన కాలేజ్ కు అందజేశారు. దాతృత్వంతో వారం రోజుల్లోనే బల్లలు పంపించిన దయానంద్ రెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం కమ్మర్‌పల్లి జూనియర్ కాలేజ్ జరిగిన డ్యూయల్ డెస్క్ బెంచ్ ల వితరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 2023లో కమ్మర్‌పల్లి గ్రామ ప్రజలు, స్థానిక నాయకుల కోరిక మేరకు అప్పటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు స్వయంగా విజ్ఞప్తి చేసి, వారి ఆశీస్సులతో ఈ జూనియర్ కాలేజ్ ను మంజూరు చేయించిన విషయాన్నీ ఎమ్మెల్యే గుర్తుచేసుకున్నారు. గత రెండున్నర, మూడు సంవత్సరాలుగా జూనియర్ కాలేజ్, స్కూల్ భవనంలో కొనసాగుతుండటం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారుల ద్వారా తెలుసుకున్నానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా, కాలేజ్ ను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్ భవనంలోకి మార్చడం, దానికి అవసరమైన మరమ్మతులు చేయించడం. కమ్మర్‌పల్లి జూనియర్ కళాశాలకు శాశ్వత నూతన భవన నిర్మాణానికి అవసరమైన నిధులను మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి తక్షణమే ప్రతిపాదనలు పంపడం కళాశాలలో మంజూరైన లెక్చరర్ పోస్టులు, సిబ్బంది కొరతపై జిల్లా కలెక్టర్‌తో పాటు రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించడం వంటి కళాశాల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన కోసం ఎమ్మెల్యేగా నా వంతు కృషి చేస్తానని అన్నారు. కమ్మర్‌పల్లి గ్రామంలో గతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ, ఎన్నికలలో ఇక్కడి ప్రజలు ఆశించిన స్థాయిలో మద్దతు తెలుపలేదని అయిన, ఎన్నికల ఫలితాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పదవుల్లో ఉన్నా లేకున్నా కమ్మర్‌పల్లి గ్రామ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పీ ఏ సీ ఎస్ చైర్మన్ దేవేందర్, జిల్లా నాయకులు రాజగౌడ్,బద్దం చిన్నారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్, కమ్మర్‌పల్లి సర్పంచ్ హారిక అశోక్, ఉప సర్పంచ్ అశోక్, ఆర్.ఆర్ నగర్,చౌట్ పల్లి, బషీరాబాద్, నర్సాపూర్ గ్రామాల సర్పంచులు, స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, వీడీసీ అధ్యక్షులు సుభాష్, గ్రామ పెద్దలు, అధ్యాపక బృందం, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,,విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

I will extend my support for creating infrastructure at Kammarpally Junior College.
Comments (0)
Add Comment