సీఎం కప్ క్రీడా పోటీలకు భారీ స్పందన

 

. . . అట్టహాసంగా ముగిసిన క్రీడా పోటీలు

 

. . . విజేతలకు బహుమతులు అందజేసిన ఎంపీడీవో అనంతరావు

 

ఇందల్ వాయి, బతుకమ్మ :

 

ఇందల్ వాయి మండల కేంద్రంలో గత మూడు రోజులుగా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నమెంట్ పోటీలు నిర్వహించారు. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ముగింపు కార్యక్రమానికి మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సీఎం పోటీలలో భాగంగా గెలుపొందిన విజేతలకు అనంతరావు తో పాటు ఇందల్వాయి గ్రామ సర్పంచ్ లోకాని గంగామని గంగారం, ఎంఈఓ గాయత్రి, సర్పంచ్ ల ఫోరం మండల అధ్యక్షులు సుదర్శన్ నాయక్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోత్కూరి నవీన్ గౌడ్ లు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇందల్వాయి గ్రామ ఉపసర్పంచ్ మోత్కూరి శ్రీనివాస్ గౌడ్, హెచ్ఎం వెంకట్ రాంరెడ్డి, పిడి రాజేశ్వర్, సురేష్, సుష్మ, సాయి, రాధా, సునీత, ఉపాధ్యాయుల బృందం, వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి భరత్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

 

Huge response to CM Cup sports competitions
Comments (0)
Add Comment