హైకోర్టు న్యాయమూర్తికి సన్మానం

ముప్కాల్, బతుకమ్మ: మండల కేంద్రంలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థులు (1986 – 87) బుధవారం హైదరాబాద్ లో హై కోర్టు జడ్జి అలిశెట్టి లక్ష్మీనారాయణ ను సన్మానించారు.  తమతోపాటు ఎస్సెస్సీ చదివిన లక్ష్మీనారాయణ న్యాయ మూర్తిగా ఉండడం గర్వంగా ఉందన్నారు. తనతో కలిసి చదువుకున్న వారు విద్యార్థులకు, గ్రామానికి, సమాజానికి చేస్తున్న సేవలకు అభినందించిన న్యాయమూర్తి.. తన వంతు సహాయం ఎప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమం లో సామ రమేశ్ రెడ్డి, సతీశ్ రెడ్డి, బండి రాజేశ్వర్, కోట ధర్మరాజు, గిరిధర్ రావు, షేక్ హుస్సేన్, కమలాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Honorable High Court Judge
Comments (0)
Add Comment