29.6 C
Hyderabad
Sunday, August 2, 2026

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ప్రశ్నించిన  హైకోర్టు 

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్, బతుకమ్మ :    రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ను  హైకోర్టు ప్రశ్నించింది. స్థానిక సంస్థలకు సంబంధించి  రీ నోటిఫికేషన్ ఇవ్వాలని సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ఎన్నికలు ఎప్పుడూ నిర్వహిస్తారని ప్రశ్నించింది. సుప్రీం కోర్టు కూడా ఎన్నికలకు వెళ్లాలని సూచించింది కదా అని గుర్తు చేసింది. ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే రీ నోటిఫికేన్ ఉంటుందని ఈసీ తరపు న్యాయ వాది కోర్టుకు తెలిపారు. ప్రభుత్వం, ఈసీ రెండు వారాల సమయం కావాలని కోరడం తదుపరి విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.  ఇదిలా ఉండగా.. బీసీ రిజర్వేషన్ల కు ఎన్నికల సంఘం ఇచ్చిన నోటిఫికేషన్ పై ఇటీవల హైకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే.

 

 

More articles

Latest article