29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

ఘనంగా నేతాజీ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ,నందిపేట్: నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలు మ్యాగ్నిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మ్యాగ్నిల్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిజామాబాద్ జిల్లా పి.ఆర్.ఓ గాదరి లింగం మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య  సమరంలో సాయుధ పోరాటం చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు, స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చేది కాదు – అది మనంతట మనమే తీసుకోవాలని చెప్పిన ఆ నేతాజీ అడుగుజాడల్లో అందరు నడుచుకొని భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరిరక్షణ కమిటీ సభ్యులు చింతకుంట సురేష్, పొలాస ముత్యం, విడిసి అధ్యక్షులు మంతెన నరేందర్, మరియు మంతెన ముత్తి లింగం, మరియు కోలి దీక్షిత, జంగం రమేష్,తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article