ఘనంగా నేతాజీ జయంతి
బతుకమ్మ,నందిపేట్: నందిపేట్ మండలంలోని వెల్మల్ గ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129 వ జయంతి వేడుకలు మ్యాగ్నిల్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మ్యాగ్నిల్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు, సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిజామాబాద్ జిల్లా పి.ఆర్.ఓ గాదరి లింగం మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్య సమరంలో సాయుధ పోరాటం చేసిన యోధుడు సుభాష్ చంద్రబోస్ అని దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు, స్వేచ్ఛ అనేది ఎవరో ఇస్తే వచ్చేది...