27.5 C
Hyderabad
Saturday, August 1, 2026

జిపి సిబ్బంది మృతి

Must read

📰 Generate e-Paper Clip

  • వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన

 

బోధన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లీ గ్రామంలో గ్రామపంచాయతీ ట్రాక్టర్ పై విద్యుత్ స్తంభాలు తరలించేటప్పుడు జరిగిన ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది గురువారం మృతి చెందారు. ఈ దుర్ఘటనపై వామపక్ష పార్టీల నేతలు తీవ్రంగా స్పందించారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద నిరసన ధర్నా చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా గ్రామ పంచాయతీ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం కారణంగా కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడిందని పేర్కొంటూ, మృతుడి కుటుంబానికి తక్షణమే నష్టపరిహారం, ఎక్స్గ్రేషియా ఆర్థిక సహాయం, అలాగే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. వామపక్షాలు ఈ ఘటనను పాలనా నిర్లక్ష్యం, భద్రతా ప్రామాణికాలపట్ల గ్రామీణ సంస్థల దృష్టిక్షిప్తిగా పరిగణిస్తున్నాయి. ఈ విషాదకర ఘటన స్థానిక పరిపాలనా లోపాలను మరోసారి ఎత్తిచూపుతోంది.

GP staff died

GP staff died

 

More articles

Latest article