గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లా గవర్నర్‌ ప్రసంగం

రాష్ట్రంలో ఎండితున్న  పంటలు

గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే

మాజీ మంత్రి కేటీఆర్

వెబ్ న్యూస్, బతుకమ్మ :  గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్‌లాగా గవర్నర్‌ జిష్ణుదేవ్ వర్మ  ప్రసంగం ఉందని మాజీమంత్రి కేటీఆర్ విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. రేవంత్‌ చేతకానితనం వల్ల రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయన్నారు.  రాష్ట్రంలో 30 శాతానికి మించి రుణమాఫీ జరగలేదన్నారు.  గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ అబద్ధాలే అన్నారు. 20 శాతం కమీషన్‌ తప్ప.. విజన్‌ లేని కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్‌పై కోపంతో మేడిగడ్డకు మరమ్మతులు చేయించలేదన్నారు. గత 15 నెలల అట్టర్‌ప్లాప్‌ పాలనపై ప్రాయశ్చిత్తం ఉంటుందని అనుకున్నామన్నారు. మూడేళ్ల తర్వాత కాంగ్రెస్ తల్లిని, రాహుల్ గాంధీ తండ్రిని సెక్రటేరియట్ నుంచి మంచిగా మూట కట్టి గాంధీ భవన్‌కు పంపిస్తామన్నారు ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యనించారు.

Governor's speech at Gandhi Bhavan as a press meet
Comments (0)
Add Comment