- జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎయిడ్స్ వ్యాధి నివారణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి లోని ఏడవ అంతస్తులో గల సెమినార్ హాల్లో ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్, తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ, జిల్లా ఎయిడ్స్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ యూనిట్, స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్నేహ టార్గెటెడ్ ఇంటర్వెన్షన్ ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ హాజరై ప్రసంగించారు. తప్పని పరిస్థితుల్లో వృత్తిని ఎంచుకోని జీవనోపాధి పొందుతున్నారని అన్నారు. మీ కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని తమ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పెన్షన్ తో పాటు సరైన పోషకాహారాన్ని తీసుకోవాలని సమయానుకూలంగా మందులు వాడలని సూచించారు. ప్రతి జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. సెక్స్ వర్కర్ల సంక్షేమం వారి మంచి కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీ నిర్వహిస్తున్న స్నేహ టార్గెటెడ్ ఇంటర్వేన్షన్ ప్రాజెక్ట్ నిర్వాహకులు ఎస్.సిద్దయ్య అందించిన పౌష్టికాహార కిట్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా విభాగాల వైద్య అధికారులు, ఆస్పత్రి అధికారులు, వైద్యులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.