తెయూ ఆంగ్ల విభాగంలో గోగునేని నాగజ్యోతికి డాక్టరేట్

నిజామాబాద్ రూరల్, బతుకమ్మ : తెలంగాణ యూనివర్సిటీ ఆంగ్ల విభాగాధిపతి డా.కె. వి. రమణాచారి పర్యవేక్షణలో పరిశోధక విద్యార్థిని  గోగునేని నాగజ్యోతి ” ఫ్యామిలీ మ్యారేజ్, సొసైటీ ఇన్ ద సెలెక్ట్ నావెల్స్ ఆఫ్ మంజు కపూర్ .”   అనే అంశంపై పరిశోధన జరిపారు. సోమవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్సటర్నల్ ఎగ్జామినర్ గా కాకతీయ యూనివర్సిటీ  ప్రొఫెసర్ దీపజ్యోతి ఆన్లైన్లో హాజరై  పరిశోధన సిద్ధాంత గ్రంధాన్ని సమగ్రంగా మూల్యాంకనం చేశారు.  పరిశోధక విద్యార్థి గోగినేని నాగజ్యోతి పరిశోధన ఇప్పుడున్న సమాజానికి ఎంతగానో ఉపయోగపడుతుందని దీని వల్ల దేశంలో జరిగే వివాహ వ్యవస్థ  ప్రయోజనాలను ఈ సిద్ధాంత గ్రంథంలో తెలియజేయడం జరిగిందన్నారు. ఆచార్య దీపజ్యోతి పరిశోధన అంశాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ  డిగ్రీ ప్రదానానికి ఆమోదం తెలిపారు. ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు ఆర్ట్స్ డీన్ ఆచార్య కే లావణ్య  డాక్టర్ పి సమత ,  డాక్టర్ మహమ్మద్ జమీల్ అహ్మద్, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి   కాంటాక్ట్ అధ్యాపకులు ఎల్.జోష్ణ, ఎన్ స్వామి   పరిశోధక విద్యార్థిని విద్యార్థులు హాజరయ్యారు.

Goguneni Nagajyoti receives doctorate in the English department of TEU
Comments (0)
Add Comment