29.9 C
Hyderabad
Saturday, August 1, 2026

‘డబుల్’ హక్కు పత్రాలివ్వండి

Must read

📰 Generate e-Paper Clip

బాన్సువాడ, బతుకమ్మ: డబుల్ బెడ్ రూం ఇళ్ల హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మల్లాపూర్, బైరాపూర్ గ్రామాలకు చెందిన 200 మంది లబిధదారులు బీర్కూర్ రెవెన్యూ కార్యలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. మాజీ జెడ్పీటీసీ స్వరూపశ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయానికి తరలివచ్చిన లబ్ధిదారులు అక్కడే బైటాయించి నినాదాలు చేశారు. ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఉంటున్న తమకు హక్కు పత్రాలు ఇవ్వడం లేదని, భవిష్యత్ లో తమకు ఏవైనా ఇబ్బందులు రావొచ్చని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు డబుల్ ఇళ్లు పంపిణీ చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఆయనే తమకు హక్కలు పత్రాలు అందించాలని విజ్ఞప్తి చేశారు.  ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరానికి కృషి చేస్తానని తహసీల్దార్ లత అన్నారు.

Give 'double' right documents

More articles

Latest article