‘డబుల్’ హక్కు పత్రాలివ్వండి

బాన్సువాడ, బతుకమ్మ: డబుల్ బెడ్ రూం ఇళ్ల హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మల్లాపూర్, బైరాపూర్ గ్రామాలకు చెందిన 200 మంది లబిధదారులు బీర్కూర్ రెవెన్యూ కార్యలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. మాజీ జెడ్పీటీసీ స్వరూపశ్రీనివాస్ ఆధ్వర్యంలో తహసీల్ కార్యాలయానికి తరలివచ్చిన లబ్ధిదారులు అక్కడే బైటాయించి నినాదాలు చేశారు. ఎనిమిదేళ్లుగా డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఉంటున్న తమకు హక్కు పత్రాలు ఇవ్వడం లేదని, భవిష్యత్ లో తమకు ఏవైనా ఇబ్బందులు రావొచ్చని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు డబుల్...