నిజామాబాద్, బతుకమ్మ :
ఢిల్లీలో జరిగిన పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్ లో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన ఇందూర్ నగరానికి చెందిన డిలోడ్ ఘన్ రాజ్ భారతీయ జనతా పార్టీ ఇందూర్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ సన్మానించి , అభినందించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేక అవార్డులు సాధించి , జిల్లాకు , రాష్ట్రానికి వవర్ లిఫ్టింగ్ రంగంలో పెరు తీసుకుని రావాలని అన్నారు. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారిలు గోల్డ్ మెడల్ సాధించిన డిలోడ్ ఘన్ రాజ్ అభినంధించినట్లు తెలిపారు.