24 C
Hyderabad
Sunday, August 2, 2026

పాడే మోసిన మాజీ ఎమ్మెల్యే బాజీరెడ్డి గోవర్ధన్

Must read

📰 Generate e-Paper Clip

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు మృతి

—అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్

ఇందల్వాయి,బతుకమ్మ :                                                                                                                                          
ఇందల్వాయి మండల కేంద్రంలోని గన్నారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, దివ్యాంగుల అధ్యక్షులు కుంట మహిపాల్ రెడ్డి మంగళవారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. బుదవారం ఉదయం  రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, ధర్పల్లి మాజీ జెడ్పిటిసి జగన్ బుధవారం ఉదయం అంత్యక్రియల్లో పాల్గొని పాడే  మోశారు.  కుంట మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చారు. మైపాల్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఎనలేని సేవ చేశారన్నారు. అందరితో కలుపుగోలుగా ఉండే మైపాల్ రెడ్డి మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article