నిజామాబాద్ క్రైం, బతుకమ్మ:
తన ఆవేశమే తనకు శత్రువు అనే సామెత. నగర శివారులో ఆర్సపల్లి గేట్ దాటిన తరవాత ఓ మహిళ గుర్తుతెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్ ఐ సాయరెడ్డి తెలిపిన వివరాల ప్రకారంబోదన్ మండలం అచన్ పల్లికి చెందిన అసది సుజాత (38) అర్సపల్లికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ అసధి రవితో 14 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం జరిగిందన్నారు. అయితే కుటుంబీకులు, కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం మృతురాలి కి ఆవేశం ఎక్కువగా ఉండేదని, చీటికిమాటికి భర్త తో కూడా గొడవకు దిగేదని, అలాగే పక్క ఇంటి వారితో కూడా తరచుగా గొడవకు పడుతూ ఉండేదని స్థానికులు తెలిపారని ఎస్ఐ తెలిపారు. రాత్రి మంగళవారం కూడా మృతురాలు పక్కింటి వారితో గొడవ పడి ఇంటి నుండి రాత్రి 9.30 నిమిషాలకు బయటకు వెళ్ళగా భర్త అంతట వెతికినా కనిపించ లేదని, బుధవారం ఉదయం పట్టాల పక్కన మృతదేహం రైలు పట్టాల పక్కన కనిపించిందని భర్త తమకు సమాచారం ఇచ్చినట్లు రైల్వే ఎస్సై సాయి రెడ్డి వివరించారు. తన భార్య మృతి పై తనకు ఎవరి పై ఎలాంటి అనుమానం లేదని, దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
