సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ మాజీ ఉద్యోగి విరాళం

కామారెడ్డి, బతుకమ్మ : సాయుధ దళాల పతాక నిధికి విద్యుత్ శాఖ ఉద్యోగి (రిటైర్డ్) కె.క్రిష్ణ మూర్తి శర్మ (పంతులు) లక్ష రూపాయల విరాళం అందజేశారు. దేశ రక్షణ కోసం తమ జీవితాలను త్యాగం చేస్తూ తమ భార్య పిల్లలను ఇంటి దగ్గరేవుంచి ఎక్కడో దేశ సరిహద్దులలో భారత దేశ రక్షణ కొరకు, భారత ప్రజల సుఖశాంతుల కొరకు పనిచేస్తున్న భారత త్రివిధ దళాల సేవలు మరవలేనివని అన్నారు. అందుకే వారి సంక్షేమానికి భారత దేశ పౌరునిగా చేయూతనందిస్తూ వారికి సంఘీభావం తెలుపుతూ సాయుధ దళాల పతాక నిధికి లక్ష రూపాయల ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల అధికారిడి.రమేష్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువతో సత్కరించారు.  కె.క్రిష్ణ మూర్తి శర్మ (పంతులు) ని స్పూర్తిగా తీసుకొని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల నుండి వ్యాపారస్తులు, ప్రజలు దేశ రక్షణలో విధులు నిర్వహిస్తున్న సైనికులకు, వారి కుటుంబాలకి స్వచ్ఛందంగా విరాళాలను అందించి ఆదుకోవాలని కోరారు. దేశ రక్షణ కొరకు చేసిన త్యాగాలకన్న మించిన త్యాగం మరి ఏది లేదని కొనియాడినారు.  ఈ సన్మాన కార్యక్రమములో ప్రాంతీయ సైనిక సంక్షేమ అధికారి (పూ.అ.భ), డి.రమేష్, కార్యాలయ సిబ్బంది, బదాం గంగామోహన్, ఉమేర్ పాల్గొన్నారు.

Former Electricity Department employee donates to Armed Forces Flag Fund
Comments (0)
Add Comment