కలెక్టరేట్ లో మాజీ సీఎం రోశయ్య జయంతి, దొడ్డి కొమురయ్య వర్థంతి వేడుకలు

కామారెడ్డి, బతుకమ్మ : కామారెడ్డి కలెక్టరేట్ లో శుక్రవారం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి,  దొడ్డి కొమురయ్య వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశీష్  సాంగ్వాన్, జిల్లా అదనపు కలెక్టర్లు చందర్ నాయక్, విక్టర్, రవికుమార్, టిజిఓ  సెక్రటరీ సాయి రెడ్డి, టిఎన్జీవో అధ్యక్షులు వెంకట్ రెడ్డి, మరియు సభ్యులు, జిల్లా అధికారులు, ఆర్యవైశ్య సంఘం ప్రతినిధులు, కలెక్టరేట్ ఏవో  సయ్యద్ మసూద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Former CM Rosaiah's birth anniversary and Doddi Komuraiah's death anniversary celebrations at the Collectorate
Comments (0)
Add Comment