. . . బాన్సువాడ ఆసుపత్రికి తరలించిన విద్యార్థులు
బాన్సువాడ, బతుకమ్మ :
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఆదివారం రాత్రి ఫుడ్ పాయిజన్ ఘటన జరిగింది.ఘటనలో సుమారు 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో9 మందికి తీవ్రమైన విరేచనాలు, వాంతులు రావడంతో కళాశాల యాజమాన్యం అప్రమత్తమైంది. వెంటనే అంబులెన్సుల ద్వారా అందరినీ బాన్సువాడ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో బాన్సువాడ ఆర్డిఓ విద్యార్థులను పరామార్శించారు. విద్యార్థులకు అదివారం పెట్టిన పుడ్ లో నాణ్యత ఉందా లేదా అనే విషయంపై విచారణకు అదేశించినట్లు తెలిసింది.
9 మందిని అడ్మిట్ చేశాం: ఏరియా ఆసుపత్రి వైద్యుడు
నిన్న తిన్న ఆహారానికి విద్యార్థులు వాంతులు, వీరేచనాలు చేసుకున్నారు. మొత్తం 12 మందిని తీసుకురాగా 9 మంది ఆరోగ్యం బాగా లేనందున అడ్మిట్ చేశాం. మరో ముగ్గురికి ఒపీవైద్యం చేశాం.
. . .విద్యార్థులను పరామర్శించిన ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్.
రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ఆసుపత్రికి లో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చికిత్స అందించాలని సూచించారు. విద్యార్థులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.