ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం

హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఈ మేరకు ఎన్నికల అధికారులు ప్రకటన జారీ చేశారు. ఏకగ్రీవం అయిన ఎమ్మెల్సీలకు ద్రువీకరణ పత్రాలు గురువారం అందజేశారు. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా విజయశాంతి, , అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సీపీఐ నుంచి సత్యం, బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ నామినేషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు మరో ఆరుగురు స్వంతంత్రులు నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు సరిగా దాఖలు చేయని కారణంగా స్వంతంత్రుల నామినేషన్లు తిరస్కరించబడ్డాయి. దీంతో వీరంతా ఏకగ్రీవం అయినట్లు ఈసీ ప్రకటించింది. నూతనంగా ఎమ్మెల్సీలుగా ఎన్నికైన వారికి ఆయా పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.

Five MLC seats are unanimous.
Comments (0)
Add Comment