28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బంగ్లాదేశ్ లో కుప్పకూలిన ఫైటర్ జెట్

Must read

📰 Generate e-Paper Clip

వెబ్ న్యూస్, బతుకమ్మ : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని డాకాలోని ఓ కళాశాల ప్రాంగణంలో ఎఫ్-7 ట్రైనింగ్ ఫైటర్ జెట్ కుప్పకూలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాలేజ్ ప్రాంగణంలో పడటంతో విద్యార్థులు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఒకరు మరణించినట్లు సమాచారం. పలువురికి గాయాలయ్యాయి. మరణించిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Fighter jet crashes in Bangladesh

More articles

Latest article