నిజామాబాద్, బతుకమ్మ : బోధన్ నియోజక వర్గానికి చెందిన బీజేపీ జిల్లా కార్యదర్శి మారోజు సుధాకర్ చారీని సస్పెండ్ చేస్తున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ క్రమ శిక్షణారాహిత్యానికి పాల్పడినందుకు ప్రాథమిక సభ్యత్వం నుండి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. వారం రోజుల్లో లిఖితపూర్వకంగా జిల్లా పార్టీకి వివరణ ఇవ్వాలని, లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
