ఆళ్లగడ్డ,బతుకమ్మ : ఏపీలోని ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు వేగంగా దూసుకెళ్లి.. డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను హైదరాబాద్ కు చెందిన గుండురావు(60), శ్రావణ్ (22), నరసింహ, బన్నీగా గుర్తించారు. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను రక్షించి స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు ఘటనా స్థలాన్ని డీఎస్పీ ప్రమోద్ కుమార్ పరిశీలించారు. ఈ ప్రమాదంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.