- కామారెడ్డి అదనపు కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డి
బతుకమ్మ, మద్నూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు భరోసా సర్వేను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ డి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం లో రైతు భరోసా సర్వేను మండలంలోని లచ్చన్, అనంతపూర్ గ్రామాల్లో పరిశీలించారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందజేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తాహసిల్దార్ ఎండి ముజీబ్, ఎంపీడీవో రాణి, మండల వ్యవసాయ అధికారి రాజు, గిర్దవార్ శంకర్ తదితరులు ఉన్నారు.